మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మేనకోడలు వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడ సమీపంలోని కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కొడాలి నాని మేనకోడలు , కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరి దేవి కుమార్తె వివాహా వేడుకకు హాజరైన వధువు డాక్టర్ స్నేహ, వరుడు డాక్టర్ అనురాగ్ దీపక్‌లను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో కూడా తెగ సందడి చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం ఈరోజు కుటుంబ సమేతంగా మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడకు వచ్చారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ గుడి నుండి తిరిగి వెళ్ళే సమయంలో కొడాలి నాని కారు వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బారికేడ్ ను ఒక్క సరిగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన కారులోనే కొడాలి నాని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావిస్తున్నారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు, భద్రత సిబ్బంది కూడా చిన్న ప్రమాదం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కొడాల నాని మేనకోడలి వివాహం గురువారం జరగగా, ఆ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ ఉదయం అమ్మవారి గుడికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.కొడాలి నాని ఇటీవల పవన్ కళ్యాణ్, చంద్రబాబు,లోకేష్‌పై విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న సంగత తెలిసిందే.