CM YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, జగన్ మధ్య విపత్కర పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్‌కు లేదని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….‘‘చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు.
రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా.. అలాగే పెట్టారు. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐల విచారణను పురందేశ్వరి కోరితే.. జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు. జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగనులో భయం పట్టుకుంది. సీబీఐ, ఈడీలు ఎప్పుడు వస్తాయో తెలీదు కానీ.. సీఎం జగన్ తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు సహా మాజీ మంత్రులందరినీ జైలుకు పంపుతామని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు.
సీఐడీ కేసులతో చంద్రబాబుని వైసీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతోందనేది టీడీపీ వాదన. ఈ క్రమంలో టీడీపీ ప్రోద్బలంతోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. జగన్ కేసుల్ని కదిలించాలనే ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. ఆయన పిటిషన్ తో సుప్రీంకోర్టు సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరికి వాయిదా వేసింది. అయితే జగన్, చంద్రబాబు మధ్య వాదోపవాదనలు చర్చ జరుగుతుండగా, ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.