CM YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు అవాకులు చవాకులు పేల్చుకుంటున్నారు. రీసెంట్‌గా అసెంబ్లీ సమావేశాలు జరగగా అక్కడ జగన్ టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో కనీసం హోదా అంశాన్ని రాసి ఉంటే బాగుండేది!.. కోర్టుకు వెళ్లయినా సరే సాధించుకునే వీలు ఉండేది!.. ఇప్పుడు, కేంద్రం ఇస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి నెలకొందని.. అందుకే కేంద్రంలో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. అప్పుడైనా సరే నిధులు, హోదాపై మాట్లాడే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలన అనుభవంపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మాట్లాడితే 14ఏళ్లు అంటారు, ఎందుకు పనికొస్తుంది ఆ అనుభవం.. అనుభవం లేకపోయినా అందరూ ఆశ్చర్యపోయే పాలన అందిస్తున్నామంటూ జగన్ పేర్కొన్నారు.
మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చూపించామన్నారు. ఇంటింటి ఆర్ధిక పరిస్థితిని మార్చి , పేదలకు అండగా నిలిచామని జగన్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల విద్యా, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సీఎంగా తనకు 14 ఏళ్ల అనుభవం వుందని చంద్రబాబు చెబుతున్నారని.. రాష్ట్రానికి పనికిరాని ఆ అనుభవం ఎందుకని జగన్ సెటైర్లు వేశారు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు ఎందుకు అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్‌కు వెన్నుపోటేనని.. అన్ని సామాజిక వర్గాలను ఆయన మోసం చేశారని సీఎం ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకుని కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని .. ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుందన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని.. చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్థానాలు ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుతాడని జగన్ ఎద్దేవా చేశారు.. అలానే బాలయ్యపై కూడా ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు జగన్.