CM YS Jagan : ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి సభలో జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో బీసీల పొట్ట కొట్టారని ఆరోపించారు.30 లక్షలకు పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టడం జరిగింది.2019 ఎన్నికల ప్రచారం సమయంలో ఏలూరులో వైసీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చాక బీసీలను నట్టేట ముంచారని విమర్శించారు.బీసీలు సంక్షేమానికి ఎన్నో హామీలు ప్రకటించే అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేదని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండి పడటం జరిగింది.
అయితే తాజాగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ మాట్లాడారు. మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అమ్మఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు సీఎం జగన్. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదని చెప్పారు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదని అన్నారు.
గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా..? అని.. ఎక్కడ లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. బాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని.. పొదుపు సంఘాలకు చేసిన దగా కనిపిస్తుందన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారరు. వీరిద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారని.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నమ్మడం అంటే.. కాటేసే పామును నమ్మడమేనని.. బాబు-పవన్‌ను నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమేనన్నారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని ధ్వజమెత్తారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…