CM YS Jagan : ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారాలు చాలా హీటెక్కిపోతున్నాయి. మరో ఆరు రోజులలో ఎన్నికలు జరగనుండగా, అందరు నాయకులు తమ ప్రచారాల స్పీడ్ పెంచారు. ఇక జగన్ కూడా అన్ని ప్రాంతాలలో ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మచిలీపట్నంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని జగన్ వ్యాఖ్యానించారు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులను అడ్డుకుంటున్నారని.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని అన్నారు. అలాగే కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారన్న వైఎస్ జగన్.. ప్రజలకు మంచి చేసే తనను ఉండకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంత వరకూ వేల ఎకరాలు క్రమబద్దీకరించామని.. ఎక్కడా పొరపాటు జరగలేదని అన్నారు. భూ వివాదాలు పెరిగి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని జగన్ అన్నారు. భూ వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని.. సంస్కరణ తీసుకురావాలనేదే తన ఆలోచన అని సీఎం జగన్ తెలిపారు.ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ తో ఫిర్యాదు చేయించి అన్నీ అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు. లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని అన్నారు.
బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమే. చంద్రబాబును నమ్మితే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఆయనవి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే. ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు. 2 లక్షల కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడు. ఆ డ్రగ్స్ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని అప్పుడే తేలింది. తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్ అయింది’’ అని సీఎం జగన్ మాట్లాడార. . ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలకు మరోసారి బడుగు బలహీనవర్గాలు, పేదలు బలి అవుతున్నారని వైసిపి అంటోంది. ఎలక్షన్ కోడ్ ను అడ్డం పెట్టుకుని టిడిపి నేతల ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని… దీంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు జగన్.