CM YS Jagan : ములాఖ‌త్‌లో మిలాఖ‌త్ చేసుకున్నారు.. ప‌వ‌న్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

CM YS Jagan : స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు నాటినుంచి ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కావాలనే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారంటూ టీడీపీ, జనసేన సహ ప్రతిపక్ష పార్టీలు అధికారపార్టీ వైసీపీపై ఫైర్ అవుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి ఆరు రోజులు గడుస్తోంది. ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో చంద్రబాబు అరెస్టయ్యారంటూ చంద్ర‌బాబు తెలియ‌జేశారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తికి కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని.. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడింది అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

చట్టం ఎవరికైనా సమానమేనని.. చంద్రబాబును కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు రిమాండ్ కు పంపించిందని.. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయ్యారంటూ గుర్తుచేశారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో ఐటీ అధికారులు పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని పేర్కొన్నారు. కోర్టులో పది గంటల పాటు వాదనలు జరిగాయని.. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సరైన ఆధారాలతో నోటీసులు ఇచ్చారంటూ పేర్కొన్నారు.

CM YS Jagan sensational comments on pawan kalyan alliance with tdp
CM YS Jagan

చంద్రబాబు అరెస్టయినా.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్.. అవినీతి పరుడికే మద్దతిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు కొందరు ప్రయత్నించినా.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. గతంలో జరిగిన తెలంగాణ ఎంఎల్‌సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు సీఎం జగన్. ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ సర్టిఫికేట్‌ ఇచ్చినా.. కొందరు బాబు చేసింది నేరమే కాదని వాదించేందుకు సిద్ధమయ్యారన్నారు. గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని.. అవినీతిపై ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తారన్నారు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ జగన్ విమర్శించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago