CM YS Jagan : ఏపీలో ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతుంది. మరి కొద్ది రోజులలో ఎన్నికలు రానుండగా, ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే టెన్షన్ అందరిలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సంయుక్తంగా పోటీ చేస్తుండగా, వారికి ధీటుగా జగన్ పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బస్సు యాత్ర చేస్తూ పలువురితో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి బస్సుయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి.. అంటూ ప్రజలను కోరారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనిది.. ఐదేళ్ల కాలంలోనే చేసి చూపించానన్నారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు. మొత్తం 1391 మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు.. వివిధ పథకాల ద్వారా 48 కోట్ల.. 74లక్షల 34వేల 136 రూపాయలు అందించామన్నారు సీఎం జగన్. ఎక్కడా లంచాలు లేవని, వివక్ష లేదని అన్నారు. పాఠశాలలు బాగుపడ్డాయి, వైద్య రంగం బాగుపడిందని జగన్ అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 కాలంలో తాను బటన్‌లు నొక్కి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నానని తెలిపారు.
ఇక ఇదే సమయంలో ఓ రైతు రుణమాఫీ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో రైతులు ఉండాలి. రౌడీయిజం ఉండకూడదు. మనం ముగ్గురితో పోరాడిన జగన్ అన్న ఒక్కడే. ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే ఉంటుంది. వచ్చే రోజులలో మెరుగైన ఉద్యోగాలు కలిగించాలి. ఇక్కడ వ్యవసాయ పంటలు పండిస్తాం. అందరికి ఎక్కువ ఉపయోగపడేలా మీరు ముందుకు తీసుకువెళ్లాలి అని అన్నారు.