జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్ ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చు చేసింది.
జగనన్న విద్యాదీవెన స్కీంలో భాగంగా పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టగాద, దీని వలన పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది జగన్ ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చదువుకుంటున్న విద్యార్థుల కళాశాల ఫీజుల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం భరిస్తోంది.అయితే ఇటీవల జరిగిన సభలో ఓ అమ్మాయి చాలా అద్భుతంగా మాట్లాడింది. గుక్క తిప్పుకోకుండా విద్యాదీవేన వలన ఎవరు ఎంతలా లాభపడుతున్నారని తెలియజేసింది.
విద్యాదీవేన వలన ఒక్కొక్కరికి ఎంత ఉపయోగం కలుగుతుందనేది కూడా తెలియజేసింది. ఇక ఉన్నత విద్యలు చదవడం కోసం ఎంత కృషి చేస్తున్నారు, అలానే విదేశీ చదువుల కోసం జగన్ ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తుంది, ఎన్ని కంపెనీలని తీసుకొస్తున్నారు అని చాలా బాగా చెప్పుకొచ్చింది.ఆ అమ్మాయి మాట్లాడుతున్నంత సేపు జగన్ పడి పడి నవ్వుతూనే ఉన్నాడు. ఇక చివరికి ఆమెని పిలిచి తన ఆశీర్వాదం అందించి నీకు మంచి భవిష్యత్ ఉంటుందని దీవించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.