CM YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం రంజుగా మారుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్స్ చేసుకుంటున్నారు. తాజాగా వైఎస్ జగన్.. పవన్ కళ్యాణ్,చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ లక్ష్యంగా పంచ్ లతో ఫైర్ అయ్యారు. ఏ భార్యతోనూ మూడు నాలుగేళ్లు కాపురం చేయలేని పవన్..చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్ల బంధం ఉండాలని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. ఈ ఇద్దరికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. తన పాలన పై ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్దమని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ చేసారు. ఏ భార్యతోను ముచ్చటగా మూడు.. నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయని మ్యారేజ్ స్టార్‌కు చంద్రబాబుతో మాత్రం 10-15 ఏళ్ల బంధం కొనసాగిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేసారు.
బాబు కోసమే తన జీవితమని..అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని..పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని..మరో అభిప్రాయం లేదని చెబుతున్నారని వివరించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూసామని… ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని జగన్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు సీఎం అయితే చాలు, అదే తనకు వందల కోట్లని దత్తపుత్రుడు భావిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడుకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే అంటున్నారని… ఇవ్వకున్నా ఓకే. త్యాగరాజు దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు.
ఆడవాళ్లను ఆటవస్తువులుగా మాత్రమే చూస్తూ..పెళ్లి అనే పవిత్ర వ్యవస్థ సంప్రదాయాన్ని మంట గలుపుతూ పెళ్లిళ్లు – విడాకులు తీసుకుంటున్న పవన్ నాయకుడుకు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. రెండు విషాలు కలిస్తే అమ్రుతం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ ఇద్దరి కుటిల నీతిని పేద కుటుంబం, కులం అయినా ఎదిగిందా అని సీఎం వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిగా నాలుగున్నారేళ్లు పాలన చేసిన నాతో ఢీ కొంటున్నారని జగన్ పేర్కొన్నారు. జగన్ కంటే మెరుగైన పాలన చేసాను…తనను గెలిపించండి అని చంద్రబాబు అడగగలరా అని ప్రశ్నించారు. అందులో భాగంగా తనకు చెల్లెలు ఉందని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…