CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌కు మరో 9 రోజుల సమయం ఉంది. ఈ నెల 11తో ప్రచారం ముగియనుంది.. మే 13న పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సభలు, ఇంటింటి ప్రచారం, రోడ్ షోలను నిర్వహిస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఓ వైపు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు ప్రచారంలో దూకుడు పెంచారు. అయితే వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీసెంట్‌గా ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు ప్రచారం చేస్తున్న తీరు..కూటమి ప్రభావం వంటి అంశాల పైన జగన్ ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికలకు తగిన సమయం కూడా లేకపోవడంతో… గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. గెలిచే చోట కచ్చితంగా ఫోకస్ పెట్టాలని… వాటిని కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇతర పార్టీ నేతలు జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని, 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తంచేశారు.
దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ చంద్రన్న బీమా అమలుచేస్తామని.. సహజంగా మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా కుటుంబానికి అందజేస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తాం. అందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటుచేసి బీపీ, షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తామన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…