CM YS Jagan : చంద్రబాబుది.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చాలా ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా చంద్రబాబు రాజకీయ జీవితం అంత సజావుగా సాగడం లేదు. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సిట్ వాదనలతో ఏకభవించి.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది.
రిమాండ్ విధించిన తర్వాత చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తనను అక్రంగా అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.అయితే ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి టోటల్ రివర్స్ అన్నట్టుగా మారింది . తన పతనాన్ని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. ముఖ్యంగా పొలిటికల్‌గా ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండరు. గంటల తరబడి సీఐడీ విచారణ జరుపుతుందని…కోర్టులో బెయిల్ కోసం ఇంతలా వేచి చూస్తానని చంద్రబాబు అనుకున్నాడో లేదో.. గతంలో ఎన్నో కేసుల్లో చంద్రబాబుకు క్లీన్ చీట్ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పక్కా ఆధారాలతో సీఐడీ అధికారులు సేకరించి, అవినీతికి కుట్రదారు చంద్రబాబేనని కోర్టుకు ఇచ్చిన ఛార్జ్ షీట్‌లో తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు ముందున్న దారులన్ని క్లోజ్ అయ్యాయి. ఒకవేళ నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష తప్పదు. ఈనేపథ్యంలో బాబు తరపు న్యాయవాదులు ఆయన సత్య హరిశ్చంద్రుడు అని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి వైఎస్ హయాంలోనే బాబు అవినీతిని నిరూపించి ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్ధలానికి పంపించాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. అయితే జగన్ మాత్రం ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు. అన్ని సాక్ష్యాలని క్రోడీకరించి చంద్రబాబుని అరెస్ట్ చేయించారు. వైఎస్ వల్ల కానిది జగన్ వల్ల సాధ్యమైందని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.