CM YS Jagan : మరి కొద్ది రోజులలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఏ పార్టీతో కలుస్తున్నారు.. ఎవరు పొత్తులో ఉన్నారు. ఏ పార్టీ సింగిల్ గా పోటీకి వస్తుంది అనే అంశాలపై చాలా రోజుల సస్పెన్స్ తర్వాత టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా బీజేపీ చేరడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు అధికార వైసీపీ అరాచకాలు చేస్తోందని.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తోందని.. ప్రజలు విసిగిపోయారు అని భావిస్తున్నారు . తద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశగా ఉన్నారు.
అయితే మొన్నటి అద్ధంకి సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబుకి పలు ప్రశ్నలు సంధించారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే.. మీరు గెలుస్తారు అనే నమ్మకం ఉంటే పొత్తుల కోసం దిల్లీలో ఎందుకు పడిగాపులు కాశారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. ఏపీకి మంచి చేసేందుకు అన్ని ఇప్పటికే అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు ప్రకటించారు. సీఎం జగన్ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఎటూ చూసినా జనమే.. ఇసుకేస్తే రాలనంతం జనం. జనసునామీతో ఆ ప్రాంతంతా సముద్రంలా కనపడింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ సీఎంను చూసేందుకు..ఆయన ప్రసంగం వినేందుకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి సిద్ధం సభకు చేరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది సభకు వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
తనకు ఉన్నదల్లా, నక్షత్రాలు ఉన్నన్ని పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతి గడపలో ఉన్నారన్నారు. నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని.. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, చంద్రబాబు జేబులో మరో జాతియ పార్టీ, వీరంతా తనపై దాడి చేయటానికి రెడీగా ఉన్నారని విమర్శించారు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటతో కూడా పోటి పడలేకపోయాయంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విడగోట్టిన పార్టీ, ప్రజల చేతిలో చిత్తుగా ఒడిపోయిన పార్టీలు, ఇటువంటి వారందరు మనకు పోటీగా వస్తున్నారన్నార. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని పేర్కొన్నారు. వైసీపీ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని.. చంద్రబాబు మ్యానిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడా లేదని విమర్శలు చేశారు.అయితే కొందరు ఇది చరిత్ర సృష్టించిందని ఇంతవరకు ఏపీ సభలకి ఎవరు రాలేదని అంటున్నారు.