CM YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ప్రభుత్వం తలపెట్టిన క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో క్రీడాకారులకు కిట్లు అందజేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. సీఎం వైఎస్ జగన్ తొలుత క్రికెట్ పిచ్ పై బ్యాటింగ్ చేయమంటూ బ్యాట్ చేతికి ఇచ్చి మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు.
అనంతరం బ్యాట్ పట్టుకున్న రోజాకు పిచ్ పై దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం జగన్ క్రీజులో బ్యాట్ ఎక్కడ ఉంచాలో, క్రీజులో ఎలా నిలబడాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు. దీంతో ఆమె కూడా అంతే ఓపిగ్గా బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించారు. ఓసారి క్రీజులో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతినే ఆర్కే రోజా క్లీన్ షాట్ కొట్టేశారు. దీంతో అక్కడే ఉన్న సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు చప్పట్లతో ఆమెను అభినందించారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన సీఎం జగన్ కూడా తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టారు. తద్వారా అక్కడ ఉన్న క్రికెట్ క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…