CM YS Jagan : మంగళవారం ఆగస్ట్ 15న దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెన్స్ వేడుకలలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి ఇలా పలువురు ప్రముఖులు జెండా ఎగరవేసారు. అయితే గత కొద్ది రోజులుగా జగన్, పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఏ రేంజ్‌లో నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరిపై ఒకరు మాటాలు తూటాలు పేల్చుకుంటున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. మరోవైపు వారి అభిమానులు కూడా మా నాయకుడు గొప్పంటే మా నాయకుడు గొప్పంటూ చెప్పుకొస్తున్నారు.
తాజాగా ఇద్దరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో జగన్, పవన్ కళ్యాన్ ఇద్దరు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. జగన్ జాతీయ జెండాని ఎగరవేయకుండా, కేవలం సెల్యూట్ మాత్రమే చేశాడు. అదే పవన్ కళ్యాణ్ స్వయంగా జెండా ఎగరవేసి జాతీయ జెండాకి సెల్యూట్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ కి దేశంపై ఉన్న భక్తి అని మెచ్చుకుంటూ జగన్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇక భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులో జనసేన వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు.
![CM YS Jagan : ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. జగన్, పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఇదే..! CM YS Jagan and pawan kalyan in independence day celebrations](http://3.0.182.119/wp-content/uploads/2023/08/cm-ys-jagan-pawan-kalyan.jpg)
ఇక జగన్ ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో… అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు . అందరికీ నేను చెప్పేదొక్కటే. ఎక్కడికెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. సమష్టిగా పోరాడి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదాం అని తెలిపారు.