CM Yogi : తెలంగాణలో ఎన్నికలు మరో మూడు రోజులలో జరగనుండగా, ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. బీజేపీ కూడా అధికారం కోసం పాకులాడుతుంది. ఈ క్రమంలో యోగి ఆధిత్యనాథ్ కూడా ప్రచారం చ,ఏశాడు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామనిఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందన్నారు. దేశంలో ఎలాంటి అలజడులు లేవన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాంగ్రెస్ వల్ల అయ్యేదా? అని ప్రశ్నించారు. నడుస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని, అవినీతిపరులను వదిలే ప్రభుత్వం కాదన్నారు.
తాను సీఎంగా ఉన్నానని కానీ ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించ లేదన్నారు యోగి ఆదిత్యానాథ్ . పదవులు శాశ్వతం కాదన్నారు. కానీ మనం చేసిన పనే మనల్ని గెలిపించేలా చేస్తాయని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ తాను దైవాంస సంభూతుడినని తనకు తానుగా భావిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గడీల పాలనలో లెక్కకు మించిన గాయాలు ఉన్నాయని వీటిని పూర్తిగా మానేలా చేయాలంటే కేవలం బీజేపీ నుంచి మాత్రమే సాధ్యమవుతుందన్నారు యోగి ఆదిత్యానాథ్. ప్రజలు పాలన సాగించమని గెలిపిస్తే సచివాలయానికి రాకుండా, ప్రజా దర్బార్ నిర్వహించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
జనం మార్పు కోరుకుంటున్నారని వారంతా బీజేపీ రావాలని కంకణ బద్దులై ఉన్నారని స్పష్టం చేశారు యూపీ సీఎం. అయితే ఈ మీటింగ్‌లో యోగి తెలుగులో మాట్లాడడం ప్రాధన్యత సంతరించుకుంది. నమస్కారం తెలంగాణ. సోదరీ సోదరీమణుల్లారా అందరికి నమస్కారం అంటూ యోగి తెలుగులో మాట్లాడేసరికి జనాలు తెగ గోల చేశారు. చప్పట్లో ప్రశంసించారు. ప్రస్తుతం యోగికి సంబంధించిన వీడియో విడుదల కానుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…