CM Revanth Reddy : హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు పలు పార్టీలకు చెందిన నాయకులకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు సైతం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో కలిసి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి భార్య పేరు గీతారెడ్డి. ఈ ఈవెంట్‌లో గీతా రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అందరితో గీతా రెడ్డి ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. రాష్ట్రపతి కూడా గీతారెడ్డిని పలకరించారు. దీంతో ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు. అందరి కళ్లు ఆమెను చూశాయి. సీఎం సతీమణి కావడంతో ఆమె మాట్లాడే తీరును అందరూ ఎంతో ఆసక్తిగా గమనించారు.అయితే అంతకముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్న సమయంలో ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో పాటూ మరి కొందరు క్యాబినెట్ మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.
ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకోవడం ఆనవాయితీ. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగానే ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి విచ్చేశారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ చేరుకున్న ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో బస చేయనున్నారు. ఈనెల 23 మూడు వరకూ ఈమె పర్యటన కొనసాగింది.