CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు.ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే బీఆర్ఎస్, కేసీఆర్ పై ఓ వైపు విమర్శలు కురిపిస్తూనే మధ్యమధ్యలో వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. కేసీఆర్ బాత్ రూంలో జారి పడినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా పరామర్శించారు. ఇక ఇప్పుడు ఆయన బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. మీరు 70 ఏళ్లు పూర్తి చేసుకుని మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్శంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖను పంపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులలోని లోపాలను ఎత్తిచూపుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రాజకీయాల్లో నాలుగు దశాబాద్ధాలుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నేతగా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నాను. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఊరూ.. వాడా.. గల్లీ గల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్‌ను విష్ చేస్తున్నారు. మరికొందరు అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రిలో పండ్ల దానాలు, బెడ్ షీట్స్ దానాలు చేస్తున్నారు. . ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది బీఆర్ఎస్. 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలను అందించనుంది. అంతేకాకుండా వికలాంగులకు వీల్‌ఛైర్స్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టనుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…