CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉండగా, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే పనిలో కాంగ్రెస్ ఉంటూ కేసీఆర్‌కి షాకుల మీద షాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా దెబ్బ కొడుతున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరో నలుగురు ఐదుగురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని కాంగ్రెస్ బాట పట్టించే పనిలో పడ్డారు.
అయితే బీఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అర్థ బలం ఉన్నవారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి మాటలు వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలను, ముఖ్య బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగ సిద్ధం చేశారని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మేయర్ మొంతు రామ్మోహన్ పార్టీ లో చేరారు. అయితే 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఎన్ని మంచి పనులు చేసినా బానిసలుగానే చూశారని, స్వేచ్చను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పోరాటంలో కేసిఆర్ కుటుంబం పతనం అయ్యింది. నిజాం, కేసిఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. కానీ సారూప్యత ఒకటే అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతమాని పదే పదే చెబుతుంటే ఎవరు చూసుకుంటూ లేరని రేవంత్ అన్నారు.