CM Revanth Reddy : తెలంగాణలో కొత్త గవర్న్‌మెంట్ కొలువుదీరాక తప్పులు చేసే వారిపై పక్కా గురి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు.హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అదుపులో తీసుకున్నారు.
ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్ లాల్ గతంలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు… నవీన్ కుమార్‌ను విచారించారు. ఈ వివాదం సమయంలోనే నవీన్ కుమార్ తాను ఉంటోన్న భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాజాగా సాహిత్‌ను అరెస్ట్ చేశారు.
2014లో జూబ్లీహిల్స్‌లోని తమ నివాసాన్ని సాంబశివరావుకు 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశామని భన్వల్ లాల్ సతీమణి మణిలాల్ పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. 2019లో రెంటల్ అగ్రిమెంట్ పూర్తి కాగా, ఇళ్లు ఖాళీ చేయమన్నామని తెలిపారు. కానీ ఆ రెంటల్ అగ్రిమెంట్‌కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో అద్దెకు ఇంటున్నారు. ఆయన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారుని నవంబర్ 17న మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులలో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్‌ను డిసెంబర్ 22న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పరారీలో ఉన్నారు. ఆయనను సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.