CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో టానిక్ లిక్కర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా టానిక్ వైన్ షాపుకు ఎక్సైజ్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఎక్సైజ్ అధికారులు బ్రేక్ చేశారు.ఈ నేపథ్యంలో టానిక్ నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ నోటీసులు అందజేశారు. టానిక్ లిక్కర్ దుకాణాలు అర్ధరాత్రి 2 గంటల వరకు నిర్వహించుకునే విధంగా గత ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా టానిక్ షాప్ సమయాలను ఎక్సైజ్ శాఖ అధికారులు కుదించారు.
ఈ మేరకు మద్యం షాపులను రాత్రి 11 గంటలకు మూసివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇక హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని టానిక్ వైన్‌షాపులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు జరిపారు. విదేశీ మద్యం ఎంఆర్‌పీ రేట్లను అధికారులు పరిశీలించారు. షాప్ లో ఉన్న లిక్కర్ స్టాక్ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 11 షాప్‌లలో ఎక్సైజ్ సోదాలు జరిపారుజజ సోదాల్లో వందమంది ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. డిపోల నుండి వచ్చిన స్టాక్ లిస్ట్‌ను అధికారులు పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించి రికార్డులను జీఎస్టీ అధికారులు పరిశీలించారు.
అయితే నగరంలో ఉన్న అన్ని టానిక్ లిక్కర్ షాపులికి 11గంటలకి మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయగా, దానిని తక్షణమే అమలు చేస్తారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుండడం అందరికి ఆశ్చర్యంగా మారింది. తప్పడు ఇన్ వాయిస్ ఇస్తూ టానిక్ ఎలైట్ వైన్స్ కోట్లాది రూపాయలు ఎగ్గొట్టినట్టు కూడా సమాచారం. లిక్కర్ జీఎస్టీలో లేదు. అది స్టేట్ వ్యాట్ కిందకు వస్తుంది. అయితే లిక్కరుపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్టు ఇన్ వాయిస్ బిల్లులో గుర్తించారు. ప్రత్యేక అనుమతులతో ఇచ్చిన ఎలైట్ వైన్స్‌ని బార్‌గా కూడా మార్చినట్టు తేలింది.