CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు సైతం మద్దతు ఇవ్వడంతో ఆయన స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం (డిసెంబర్ 13) స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒకే ఒక నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం స్పీకర్ పదవికి ఆయన పేరును ఖరారు చేసింది.
తెలంగాణ శాసనసభలో ఎక్కువ సభ్యులు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండగా.. స్పీకర్ పదవి దళిత నేతకు ఇవ్వడం ద్వారా తమ ప్రాధాన్యం ఏమిటో ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో 1964లో జన్మించిన గడ్డం ప్రసాద్ కుమార్.. తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రసాద్ కుమార్.. తన సమీప అభ్యర్థి బి. సంజీవరావుపై గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి చంద్రశేఖర్ (బీఆర్ఎస్)పై గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2012లో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో టెక్ట్స్‌టైల్ శాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ పని చేశారు. అనంతరం 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలతో పాటు అన్నీవర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే మంత్రివర్గంలో కూడా సామాజికవర్గాల వారిగా ప్రాధాన్యత కల్పించింది. ఇప్పుడు స్పీకర్ వంటి ఉన్నతమైన పదవిలో ఓ దళితనేతను కూర్చొబెట్టింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…