CM Revanth Reddy : ఎవరు ఊహించని విధంగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన కాన్వాయ్‌లో కార్ల కలర్‌ను తెలుపు నుంచి బ్లాక్ కలర్ లోకి మార్చాలని ఆదేశించారు. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతుననాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఈ సూచన చేసిందని అంటున్నారు. సాధారణంగా సీఎం కాన్వాయ్‌లోని కార్లన్నింటికీ ఒకే కలర్ ఉంటుంది. నంబర్ ప్లేట్లు కూడా ఒకే రకం ఉంటాయి. కానీ కార్ల ఆర్డర్ మాత్రం తరచూ మార్చేస్తారు. తద్వారా సీఎం ఏ కారులో ఉన్నదీ దుండగులకు తెలియదు. ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్ల నంబర్ ప్లేట్‌పై 0009 అనే నంబర్ ఉంది. అధికారులు సీఎం కారుకు TS 07 FF 0009 నంబర్ కేటాయించారు. కాన్వాయ్ లోని మిగతా కార్లకు మాత్రం TS 09 RR 0009 అనే నంబర్ ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఆయన 4 కలర్స్ ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారులో వెళ్తున్నారు. మిగతా కార్లకు సిల్వర్, వైట్ కలర్స్ ఉన్నాయి. దాంతో దుండగులకు ఆయన ఏ కారులో ఉన్నారో క్లియర్‌గా తెలిసిపోతోంది. ఇది సెక్యూరిటీ సమస్యలు తెచ్చేలా కనిపిస్తోంది. అందుకే సెక్యూరిటీ వింగ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని అన్ని కార్లకూ నలుపు రంగు వేసినట్టు తెలుస్తుంది. రేవంత్‌కి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. అందువల్ల అన్ని కార్లకూ అదే కలర్ వేసేయమని ఆయన ఆదేశించారు. ఇందులో సెంటిమెంటూ, వాస్తు వంటివేవీ లేవు. తాను ప్రయాణిస్తున్న కారు ప్రధానంగా బ్లాక్ కలర్‌లో ఉంది కాబట్టి.. మిగతా కార్లకు కూడా అదే కలర్ ఫిక్స్ చేశారు.
ఇక ప్రోటోకాల్ ప్రకారం.. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే.. కనీసం 5 నిమిషాల ముందు ఆ దారిలో ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అక్కడక్కడా కానిస్టేబుళ్లను ముందుగానే నియమిస్తారు. ఇతర లింకు రోడ్ల నుంచి సీఎం వెళ్లే మార్గంలోకి ట్రాఫిక్ రాకుండా చూసుకోవడం వారి బాధ్యత. కాని రేవంత్ తన కాన్వాయ్ వలన ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో రేవంత్ ఆయన కాన్వాయ్‌కి సైడ్ ఇచ్చి అంబులెన్స్‌ని పక్క దారికి మళ్లించడంతో అందరు రేవంత్‌పై ప్రశంసలు కురిపించడం మనం చూశాం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…