CM Revanth Reddy : హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు రేవంత్ రెడ్డి.సవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అభివృద్ధి, సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తుంటే నేను మునుపటిలా పనిచేస్తే సరిపోదు అని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని… ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని పేర్కొన్నారు. నాడు బండలతో నిండిన ఈ ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. ఇక్కడ రోగులకు మంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.6 కోట్లు మంజూరు చేసి… ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. ఇంత గొప్ప ఆసుపత్రికి తాను చైర్మన్‌గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…