CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు..ఇలా ప్రతి ఒక్క విషయంలోను ఆయన ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఆయన పరిపాలన విధానం.. జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమి ఇండియా నేతలను ఆకట్టుకుంటోంది. రేవంత్ పాలనను ఇండియా నేతలు మెచ్చుకుంటోన్నారు. రేవంత్ రెడ్డిని పోరాట యోధుడిగా అభివర్ణిస్తోన్నారు.
తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి రీసెంట్‌గా తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్న దారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో కేబీఆర్ పార్క్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. సీఎం రేవంత్ తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతుండగా సీఎం అటుగా ఓ అంబులెన్స్ వెళ్లడాన్ని గమనించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సూచించారు. దీంతో అంబులెన్స్‌కు దారి ఇస్తూ సీఎం కాన్వాయ్ పక్కకు వెళ్లింది. దాంతో ఆ అంబులెన్స్ వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. సీఎం చేసిన పని పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇక తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్‌లో జనానికి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్ పయనిస్తోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తుండగా.. అంబులెన్స్ అటుగా వస్తుండటంతో ఆయన తన కాన్వాయ్ ను పక్కకు జరపమని చెప్పి అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…