CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా రేవంత్ మారబోతున్నారా..? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగారా? అధిష్టానం మొత్తం అధికారాలు అప్పగించిందా? ఎంపీ టికెట్లు ప్రకటించడం ద్వారా ఢిల్లీ నుంచి పవర్ సెంటర్ హైదరాబాద్ కు మారిందా? అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.4వేల కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక ఎత్తుఅయితే అదే సభలో మాట్లాడిన మాటల సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయశంగా మారాయి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రేవంత్ కు అధిష్టానం పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అటు ఢిల్లీ పర్యటనల్లోను రేవంత్ తన మార్క్ ను చూపించి అదిష్టానం పెద్దలకు ఇక్కడ జరుగుతున్న రిపోర్ట్ ను ఇచ్చారు. దాంతో పూర్తిగా సాటిస్పై అయిన అధిష్టానం భవిష్యత్ నిర్ణయాలపై కూడ స్వేచ్చ ఇచ్చారట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ వ్యవహరించిన వ్యూహం కూడా పార్టీకి కలిసోచ్చింది. కొన్ని చోట్ల తన ముఖ్యమైన అనుచరులు ఉన్న కూడా వారి సీట్లు త్యాగం చేయించి గెలుపు గుర్రాలకు పట్టం కట్టారు. దీంతో పార్టీ రేవంత్ కమిట్ మెంట్ అప్పటి నుండే గుర్తిస్తూ వస్తుంది. అయితే రేవంత్ ప్రస్తుతం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతుండగా, తాజాగా ఆయన స్వయం సహాయక సంఘాల మహిళతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో కోస్గి నియోజక వర్గానికి చెందిన హాజమ్మ అనే జోగిని మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వలనే తాను బ్రతికి ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
జోగిని వ్యవస్థలో 500 మందికి పైగా చనిపోయారని, వారి రక్షణకై ఒక జీవో తీసుకొని రావాలని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి లెటర్ అందించానని, ఆ లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడడం వలన జీవో వచ్చి మా బతుకులు బాగుపడ్డాయని, చనిపోదాం అనుకున్న నేను అసెంబ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విని నా బ్రతుకుపై ఆశలు చిగురించాయని అన్నాడు. తాను బ్రతికి ఉండడానికి కారణం రేవంత్ అని అన్నారు. 139 జీవో ద్వారా తల్లి పేరు, తండ్రి పేరు సమానమనే చైతన్యం తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఒంటరి మహిళ పించన్ రావడానికి ప్రధాన కారకులు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఆరు వేల బెనిఫిట్ అందుతున్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…