CM Revanth Reddy Convoy : తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆర్ అధికార పీఠం దక్కించుకుంటారని ప్రచారం జరిగిన రేవంత్ రెడ్డి మ్యాజిక్‌తో బీఆర్ఎస్ శ్రేణులు కంగుతిన్నారు. రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు రేవంత్ సాదాసీదాగా ప్రయివేట్ వెహికల్‌లోనే ప్రయాణించారు. రాత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. బుధవారం మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే కేబినెట్ కూర్పుపై హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ సీఎం అయిన నేపథ్యంలో ఆయన కోసం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది.
ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కాన్వాయ్ లో వెళ్లేలా ఏర్పాటు చేసింది. కొత్త మంత్రుల కోసం ప్రోటోకాల్ అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. రాజ్ భవన్ పక్కన ఉన్న దిల్‌కుషా అతిథి గృహంలో వాహనాలను సిద్ధంగా ఉంచారు. కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 6 కొత్త ఇన్నోవా వాహనాలను రెడీ చేశారు. అధికారులు, ఇతర వర్గాల రాకతో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో సందడిగా ఉంది.సోనియా, రాహుల్ గాంధీ ప్రొత్సహం వల్లే తాను నిటారుగా నిలబడి పోరాడానని రేవంత్ పదే పదే ప్రస్తావించారు. ఆ అండనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి దండను వేసింది.
ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం పెట్టనున్నారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దివ్యాంగురాలికి ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తనకు ఆహ్వానం లభించడంపై దివ్యాంగురాలు రజినీ సంతోషం వ్యక్తంచేసింది.