CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన విషయం తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ నాయకులకి వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1 గా చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడ సిట్ అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురికి జడ్జి ఆదివారం నాడు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1 చేర్చారు పోలీసులు. ఏ2గా ప్రణీత్ రావు, ఏ3 రాధాకిషన్ రావు, ఏ4 గా భుజంగరావు,ఏ5 గా తిరుపతన్న, ఏ 6 గా మరొకరు పేరును చేర్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు కస్టడీ ముగిసింది. పోలీసుల కస్టడీలో ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడించినట్టుగా ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు రాగా, అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విషయమై ఆరోపణలు చేశారు. అప్పటి ఎస్ఐబీలోని పలువురు పోలీసు అధికారులపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు కూడ ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణను ప్రారంభించింది.
ఈ కేసులో ఎస్ఐబీ లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును వారం రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకున్నారు. ప్రణీత్ రావు అందించిన సమాచారం మేరకు సిట్ బృందం విచారిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.