Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM Revanth Reddy : ఈయ‌న వ‌ల్లే తెలంగాణ దివాళా తీసింది.. సీఎం రేవంత్ కామెంట్స్‌..

Shreyan Ch by Shreyan Ch
July 29, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయ‌కుల‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్తున్న మూడు పథకాలపై విచారణకు సిద్ధమా అని సీఎం సవాల్ విసిరారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడడానికి గత బీఆర్ఎస్ పాలనే కారణమంటూ ఆయ‌న మండిప‌డ్డారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చాలని చూసింది బీఆర్ఎస్ నాయకత్వమే అని ఆరోపించారు.

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అఖరికి గొర్రెల పంపిణీ పథకంలోనూ రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్‌ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారన్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. అంతకుముందు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రూ. 4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని.. రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోతుందని, అందుకు ఆధారాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్‌ చేశారు.

CM Revanth Reddy comments on kcr about telangana development
CM Revanth Reddy

అయితే మరోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలు విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్‌ చేసిన పొరపాట్లనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి విమర్శ‌లు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్​కు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. చోటా భాయ్ రేవంత్​రెడ్డి, ప్రధానమంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు.

Tags: CM Revanth Reddy
Previous Post

Pawan Kalyan : ఎవ్వ‌రు అడ‌గ‌ర‌ని అనుకున్నారా.. అసెంబ్లీలో ప‌వ‌న్ గ‌ర్జ‌న‌..

Next Post

Anchor Sowmya Rao : జ‌బ‌ర్ద‌స్త్ నుంచి త‌న‌ను అందుక‌నే త‌ప్పించార‌న్న యాంక‌ర్ సౌమ్య‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.