CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు.తొలిరోజు ఆయన ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల గురించి వారికి గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని గుర్తు చేసిన ఆయన.. అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారంటున్నారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకి సంబంధించి సవరించిన ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం రేవంత్, హోంమంత్రి అమిత్ షాని కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ కి సంబంధించి 26 కిలోమీటర్లు అలాగే ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ – రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ 32 కిలోమీటర్లు ఉండబోతున్నాయి. వీటికి మొత్తం రూ.15వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్ లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని కూడా అమిత్ షా ని కోరారు రేవంత్ రెడ్డి.
చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుందనే విషయాన్ని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమతులు వచ్చాయని, హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం వంటివి కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. తమ అభ్యర్థనలకు మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…