CM KCR : ఈ సారి కేసీఆర్‌కి పెద్ద షాకే ఇవ్వ‌బోతున్నారుగా.. పోటీలో 120 మంది..!

CM KCR : మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఒక‌వైపు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి ఎన్నికల బరిలో నేరుగా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును ఢీకొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం.. ఈ మేరకు వారిపై బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌.. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని సీఎం బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ కి పోటీగా 120 మంది నిలుచోబోతున్న‌ట్టు స‌మాచారం. కామారెడ్డిలో కేసీఆర్‌కి చెక్ పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ బరిలో రైతులు నిలపడనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు సమావేశం అయి.. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితుల హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల నామినేషన్లతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అంద‌రిలో నెలకొంది.. తమ భూములను కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెబుతున్న రైతులు మాస్ట‌ర్ ప్లాన్ ర‌ద్దు చేశాకనే కామారెడ్డిలో అడుగుపెట్టాల‌ని సూచిస్తున్నారు. కామారెడ్డిలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పారిశ్రామిక జోన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.

CM KCR contesting constituency 120 farmers
CM KCR

వందలాది ఎకరాలను బదలాయించే మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోక‌పోతే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు నిజామాబాద్‌ పసుపు రైతులు క‌విత‌కి షాక్ ఇచ్చారు. పసుపు బోర్డు తీసుకురావడంతో కవిత విఫలమయ్యారంటూ ఆమెకు వ్యతిరేకంగా 180 మంది రైతులు నామినేషన్‌ వేయడం అప్పట్లో సంచలనం రేపిన విష‌యం తెలిసిందే.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్‌ చేతిలో కవిత ఓటమి పాలు కాగా, రైతులు వ్యతిరేకించడంతోనే కవిత ఓడిపోయారని అప్ప‌ట్లో తీవ్ర‌మైన చ‌ర్చ న‌డిచింది. మ‌రోవైపు తెలంగాణ‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపుతున్నట్లు ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago