CM Chandra Babu Naidu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇచ్చే వాల్యూ ఇది.. చంద్ర‌బాబు చేసిన ప‌నికి అంద‌రూ హ్యాప్పీ..

CM Chandra Babu Naidu : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పరిస్థితులు ఎలా మారాయో మ‌నం చూశాం. ఇటీవ‌ల‌ కలెక్టర్ సమావేశం జర‌గ‌గా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన సదస్సుకు అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి సమావేశం జరుగుతున్న మందిరానికి వచ్చారు. చంద్రబాబు వచ్చి తనకు కేటాయించిన సీట్‌లో కూర్చునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఛైర్‌కు తెల్ల టవల్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.. దాన్ని చూసిన వెంటనే చంద్రబాబు వద్దని వారించారు.

వెంటనే ఆ టవల్ తొలగించాలని భద్రతా సిబ్బందికి సైగలు చేశారు. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఈ టవల్‌ను ఛైర్ నుంచి తొలగించారు.. అప్పుడు కానీ ఆయన ఆ కుర్చీలో కూర్చోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే ఈ సీన్ కనిపించింది.. ఆయన కూడా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని.. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. వీలైనంత తక్కువ సమయం మాత్రమే ట్రాఫిక్ ఆపాలని సూచించారు.

CM Chandra Babu Naidu what he did to pawan kalyan
CM Chandra Babu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago