CM Chandra Babu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల హస్తిన పర్యటన రీసెంట్‌ఘా ముగిసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చంద్రబాబు తన హస్తిన పర్యటనలో ఫుల్ ఫోకస్ చేశారు. ఈ ప్రాజెక్టు భవితవ్యంపై.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు ఎలాంటి హామీ వచ్చిందన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సారి చంద్రబాబు కీలక అంశాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులే అజెండాగా, ఆయన ఢిల్లీ పర్యటన సాగింది. అమరావతికి కేంద్రం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతికి ప్రకటించిన నిధుల విడుదలపైనా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర వాకబు చేసినట్లు సమాచారం.
వీటితో పాటుగా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది.. అయితే చంద్రబాబు పలుమార్లు మోదీని కలవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చంద్రబాబు 16 మంది ఎంపీలతో మోడీకి బలమైన మిత్రపక్షంగా ఉన్నారు. అయిన మోదీని బ్రతిమిలాడుకుంటున్నారు. కాని మరో మిత్రపక్షం అయిన నితీష్ మాత్రం తన రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ధనాన్ని ఫోన్ లలోనే సాధించుకుంటున్నారు. నితీష్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఎంపీలను పెట్టుకుని కూడా.. మోడీ సహా కేంద్ర మంత్రులను చంద్రబాబు బ్రతిమిలాడుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది.
గత రెండు మాసాల్లో ఏపీకి సంబంధించి సమస్యలు వివరించేందుకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. తాజాగా మరోసారి ఢిల్లీ బాట బట్టారు. చంద్రబాబు కోరికలు అంత పెద్దవి కాకపోయిన కూడా ఆయన కేంద్రాన్ని ఎందుకు బ్రతిమిలాడుకుంటున్నారు. నితీష్ కన్నా ఎక్కువ ఎంపీలని కలిగి ఉన్న చంద్రబాబుకి ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అందరు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.