Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అందరికి తెలుసు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ‘హనుమాన్’ చిత్రం దాదాపు 11 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుండగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తనకు హనుమాన్ ఎందుకు అంత ఇష్టమో చెప్పుకొచ్చాడు. తనకు సంబంధించిన ఏదైనా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని ముందుగా ఆంజనేయస్వామి ఆశీస్సులతో అంటూనే ఆ వార్తను అభిమానులకు తెలియజేస్తారు. కొణిదల ప్రొడక్షన్ లోగోని కూడా ఆంజనేయ స్వామి ఉన్నట్టు రూపొందించారు.ఇలా చిరంజీవి ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు అనే సంగతి మనకు తెలిసిందే.
ఆంజనేయ స్వామిని చిరంజీవి ఇంతలా ఆరాధించడానికి కారణం ఏంటి అసలు ఈయన ఆంజనేయ భక్తులు ఎలా అయ్యారు అనే విషయాల గురించి తాజాగా వివరించారు.కొన్ని నెలల క్రితం చిరంజీవి ఓ టాక్ షోకి వెళ్లినప్పుడు హోస్ట్ మీకు ఏ సూపర్ హీరో అంటే ఇష్టం అని అడిగారు. దానికి చిరు మనకు ‘హను మాన్’ ఉన్నాడు కదా. ఆయనే తన సూపర్ హీరో అని చెప్పాడు. ఆ మాట నుండే ఇప్పుడు ‘హను – మాన్’ టైటిల్ వచ్చింది అని చెప్పారు చిరు. ఆ షో సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ అన్నట్లు గుర్తు. ఇక చిన్నప్పుడు చిరు కుటుంబంలో ఎవరూ ధైవ భక్తులు లేరట. నాన్న కమ్యూనిస్ట్ కావడంతో దేవుణ్ని పెద్దగా నమ్మేవారు కాదట. అయితే అమ్మ ఒత్తిడితో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే వాళ్లట. అలా పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో ఆంజనేయస్వామి గుడి ఉండేదట.
రోజూ దండం పెట్టుకుని వచ్చేవాడట చిరు. 8వ తరగతి బాపట్లలో చదువుకున్నాడట. అక్కడ కూడా ఆంజనేయుడి గుడి ఉండేదట. సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లొచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారట. దాని కోసం వెళ్లీ వెళ్లీ ఆంజనేయుడిపై భక్తి ఏర్పడిందని చెప్పారు. ఆంజనేయ స్వామి మహత్వం గురించి పూజారి చెప్పిన మాటలను విని నాకు తెలియకుండానే నేను కూడా ఆంజనేయ స్వామికి భక్తుడిగా మారిపోయానని ఆ పూజారి మాటలతో హనుమాన్ చాలీసా చదవడం కూడా మొదలు పెట్టానని తెలిపారు. ను ఎక్కడికి వెళ్లినా ఆంజనేయస్వామిని నమస్కరిస్తూ నా పనులను ప్రారంభించే వాడిని.ఆ పనులన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి.ఇక ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి రావాలి అనుకున్నటువంటి తనకు ఒకరోజు మా పెరట్లో ఆంజనేయస్వామి లాకెట్ కనిపించిందని దానిని మెడలో వేసుకొని ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చానని ఇక ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు ఈ స్థాయిలో సక్సెస్ వచ్చింది అంటే నాకు తోడుగా హనుమాన్ ఉండడంతోనే ఇలా ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.