Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పలు పద్మ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు చిరు. అయితే చిరు ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకోగా, ఆయన ఇండస్ట్రీకి చెందిన వారే కాక పలువురు ప్రముఖులు కూడా అభినందించారు. అయితే తాజాగా చిరుకి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో భాగంగా ప్రెస్ మీట్ జరగగా గతంలో తన జీవితంలో ఓ జర్నలిస్ట్ తో జరిగిన సంగతి గురించి మాట్లాడారు చిరంజీవి.
చిరంజీవి మాట్లాడుతూ.. మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ మధ్యలో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినా నేను లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. తిరిగి వచ్చాక అప్పుడు ఉన్న సినిమా మ్యాగజైన్స్ సితార, జ్యోతి చిత్ర, శివరంజని.. లాంటివి అన్ని తెప్పించుకొని మన గురించి, సినిమా గురించి ఏమన్నా న్యూస్ వచ్చిందేమో అని చూస్తే ఒక్క న్యూస్ కూడా లేదు. దీంతో నేను ఆశ్చర్యపోయాను దాని గురించి ఆరా తీస్తే. అమెరికాకు వెళ్లే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారికి, నాకు మధ్య ఓ సీన్ అన్నపూర్ణ స్టూడియోలో షూట్ జరుగుతుంది.
నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఎవరన్నా వస్తే లోపలి రానివ్వద్దు అని అక్కడి వాళ్లకి చెప్పారు. అదే సమయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను కలవడాన్నికి వస్తే అక్కడ ఉన్న వాచ్ మెన్ లోపలికి పంపించలేదు. ఆ జర్నలిస్ట్ వచ్చినట్టు చెప్పమని చెప్పినా షూట్ అయ్యేదాకా ఎవర్ని పంపించొద్దు అని చెప్పడంతో అతను హర్ట్ అయి వెళ్ళిపోయాడు. దీంతో అతను వేరే జర్నలిస్టులతో కలిసి మాట్లాడి ఇలా నా గురించి, నా సినిమాల గురించి కవర్ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ వచ్చి నాకు చెప్పాక.. ఎవరో వాచ్ మెన్ చేసిన దానికి నన్ను నెగిటివ్ గా తీసుకొని అందరూ కలిసి బ్యాన్ చేయడం సబబేనా అని అడిగాను. నేను వాళ్ళ మ్యాగజైన్స్ కోసం, ప్రతి మ్యాగజైన్ కి సపరేట్ గా స్టిల్స్ ఇచ్చి వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడ్ని. అయినా ఇలా చేయడంతో నాకు బాధ అనిపించింది. ఆ సీనియర్ జర్నలిస్ట్ నాకు సారీ చెప్పినా నేను వద్దు, మీరు అలాగే మీ మాట మీదే ఉండండి అని చెప్పి పంపించాను అని తెలిపారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…