Chiranjeevi : వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా పూర్తయ్యాయని.. నైజాం ఏరియాలో ఈ సినిమాకు 32 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనే సమాచారం బయటకొచ్చింది. రైట్స్ విషయంలో భోళా శంకర్ దర్శక నిర్మాతలు తగ్గదే లే అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.
ఇక సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకు మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలని కూడా వేగవంతం చేస్తున్నారు. రీసెంట్‌గా భోళా శంకర్ షూటింగ్ స్టిల్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ షూటింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్ లో చిరంజీవి యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.మరోవైపు చిరంజీవి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వీడియొలో పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం గురించి శ్రీముఖి అడుగుతుంది. అప్పుడు చిరు మాట్లాడుతూ.. నాకు కొడుకు లాంటి వాడు. పుత్సోత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మెహర్ రమేష్ నాకు పవన్ కళ్యాణ్ మేనియా గురించి సినిమాలో పెడదామంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అన్నాను అని చిరంజీవి అన్నారు. భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన భోళా శంకర్ పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచాయి. భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో పాటు అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. సినిమా మాత్రం ప్రేక్షకులకి పిచ్చెక్కించేలా ఉంటుందని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…