Chiranjeevi : మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ పెళ్లైన 11 ఏళ్లకు తండ్రి ప్రమోషన్ అందుకున్నడు. ఈ రోజు ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చాలా సంవత్సరాలుగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పిల్లలు లేకపోవడంతో అనేకచోట్ల ఈ ప్రశ్నను వారు ఫేస్ చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఉపాసన ను టార్గెట్ చేసి వారసులను ఇవ్వడంలేదని ఎంతగానో విమర్శించారు. వీటన్నింటికి వారు మౌనంతో సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున 01:49 కు మెగా ఫ్యామిలీ లోకి మరో బుజ్జాయి వచ్చింది.
మెగా ఫ్యామిలీలోకి మరో పర్సన్ రావడంతో ఆ ఇంట సంబురాలు అంబరాన్నంటాయి. తమకు మనవరాలు పుట్టడం పై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని అందరికీ తెలియజేశారు. ఎన్నో ఏళ్ళుగా వేచి చూసిన ఆనంద క్షణాలు ఇవని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ తన మనవరాలిని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి నీ రాకతో మెగా ఫ్యామిలీ లో ఆనందాన్ని తీసుకువచ్చావు అంటూ పేర్కొన్నారు. నీ రాకతో అంతా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. కోట్లాది మంది ఆశీర్వదించిన రామ్ చరణ్ ఉపాసనల కూతురిగా, మమ్మల్ని తాతా నానమ్మలను చేశావు అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
ఇప్పటికే చిరంజీవి ఇద్దరు కూతుళ్లకి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్‌కి కూడా కూతురు పుట్టడంతో చిరు మనవరాళ్ల సంఖ్య ఐదుకి చేరింది. అయితే ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి… కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియాతో మాట్లాడారు. మంగళవారం నాడు అమ్మాయి పుట్టిందని.. ఆంజనేయస్వామిని తాము నమ్ముకున్నామని, ఆయనకు ప్రత్యేకమైన మంగళవారంనాడు ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని చెప్పారు. అపోలో ఆసుపత్రి ఛైర్మన్ పీసీ రెడ్డిగారు (ఉపాసన తాత) దగ్గరుండి అన్ని రకాలుగా కేర్ తీసుకున్నారని, బెస్ట్ మెడికల్ టీమ్ ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని చెప్పుకొచ్చారు. పోలికలు ఎవరివి వచ్చాయనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని కూడా ఆయన అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…