Chiranjeevi : జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో చాలా యాక్టివ్ గా ఉన్నారు.ఆయన వైసీపీ నాయకులని టార్గెట్ చేసి మాట్లాడడంతో వారు కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన పెళ్లిళ్లు, రెమ్యునరేషన్ గురించి బాహటంగా మాట్లాడుతున్నారు. దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తొలిసారి ఆయన తన రెమ్యూనరేషన్ ఎంత అనేది రివీల్ చేశారు. జనసేన పదవ వార్షికోత్సవ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని, తనకు డబ్బులు అవసరం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. బ్రో సినిమాకు 22 రోజులు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు… రోజుకు రెండు కోట్లు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను. ప్రతి సినిమాకు అంత ఇస్తారని చెప్పను. కానీ, నా ఏవరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. నాకు డబ్బులు అవసరం ఏముంది? నేను సంపాదించుకోలేని డబ్బులా?” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఆయనపై వైసీపీ నాయకులు దారుణమైన ట్రోల్ చేశారు.
![Chiranjeevi : పవన్ కళ్యాణ్ ఎంత తీసుకుంటే నీకెందుకు.. వారికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన చిరు.. Chiranjeevi said about pawan kalyan remuneration](http://3.0.182.119/wp-content/uploads/2023/08/chiranjeevi-1.jpg)
పవన్ కి ఎల్లప్పడు నీడలా అండగా ఉండే చిరంజీవి .. పవన్‌పై చేస్తున్న ట్రోలింగ్ పై సీరియస్ అయ్యారట. ప్రతి సారి తన తమ్ముడి గురించి అలా మాట్లాడుతుడడంతో ఓపిక నశించిన చిరు తన సన్నిహితులు దగ్గర తన తమ్ముడిని తిట్టే వారికి గట్టిగా ఇచ్చేస్తానని అన్నడట. తన తమ్ముడికి అంత క్రెడిబులిటీ ఉంది కాబట్టే ఇస్తున్నారు. అయిన ఆయన ఎంత తీసుకుంటే మీకు ఎందుకు అని వారికి గట్టిగా ఇచ్చేసానంటున్నాడట చిరు. కాగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ కళ్యాణ్ సుమారు 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనున్నారని మరో సమాచారం. సుజీత్ సినిమాకు అయితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు అందుకోనున్నారట.