Chiranjeevi : న‌ట‌న‌లో నా స్నేహితుడిని మించిపోయింది.. ఆపండి బాబాయ్ అంటూ వ‌ర‌ల‌క్ష్మీ కామెంట్..

Chiranjeevi : సంక్రాంతి బరిలో ప‌లు సినిమాలు నిల‌వ‌గా ఇందులో హ‌నుమాన్ మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీ క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురుస్తుంది. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చి సందడి చేశారు. ఈవెంట్‌లో చిరు మాట్లాడుతూ… ఈ వేడుకకు రావడానికి దోహద పడినవి నాలుగు కారణాలు. హనుమాన్ నా ఆరాధ్య దైవం, మా ఇలవేల్పు. ఆ స్వామి గురించి తెలిపే కథ ఈ హను మాన్. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ లు ఎక్కే స్టేజ్ కి అంచలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ చిత్రం ట్రైలర్ టీజర్ లో చాలా అద్భుతమైన ఫైన్‌నెస్‌ కనిపించింది.

ఇవి చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి అడిగి తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా రావాలని కోరినప్పుడు ఖచ్చితంగా వస్తాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం ఉంటుదని చెప్పడం జరిగింది..ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ విజన్, హీరో తేజ కష్టం వృథాపోవు. ఇది చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన కంటెంట్ లో సత్తా వుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. పెద్ద విజయం అందేలా చేస్తారు.

Chiranjeevi praised varalakshmi saratkumar for her acting
Chiranjeevi

అమృత అయ్యర్ కథానాయికగా నటిచింది. తనకి మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా పవర్ ఫుల్ పాత్రలతో అలరిస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. వినయ్ హాలీవుడ్ విలన్ లా కనిపిస్తున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. కెమరామెన్, సంగీత దర్శకులు, టీం అందరికీ అభినందనలు. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక మంచి ప్రకటన నేను చేస్తే బావుటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ సమయంలో ఈ చిత్రం రావడం ఒక శుభపరిణామం అని చిరు అన్నారు. అయితే వ‌ర‌ల‌క్ష్మీ గురించి చిరు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆమెలో ఆనందం మ‌రింత క‌నిపించింది. చిరంజీవి గారి ముందు మాటలు సరిగ్గా రావడం లేదని, ఎక్కడైనా సరే చకచకా మాట్లాడేస్తుంటాని, ఇక్కడ మాత్రం టెన్షన్‌గా ఉందని చెప్పుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మీ.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago