Godfather : ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న చిత్రం గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగానే పెంచింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రీ రిలీజ్ బిజనెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. అయితే పెద్ద హీరోలు తమ సినిమాలకు టిక్కెట్ రేట్స్ భారీగా పెంచడంతో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనం చూశాం.
మెగాస్టార్ సినిమాలకే భారీ నష్టాలే తప్పకపోవడంతో గతంలో టాలీవుడ్ ప్రముఖులు చేసిన రిక్వెస్ట్ లు ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు సాధారణంగానే కొనసాగుతాయని తెలుస్తుంది. గరిష్టంగా రూ.175 ఏపీలో అలాగే తెలంగాణలో కూడా ఇంతే మేర ఉండనున్నట్టు తెలుస్తుంది. అక్కడ సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 ఉంటాయని టాక్. దీనితో అయితే గాడ్ ఫాదర్ ఈసారి సాధారణ రేట్స్ కే అందుబాటులో ఉన్నాడని చెప్పాలి. ఆచార్య సినిమాపై ఉన్న హైప్ కారణంగా టికెట్ రేట్లు పెంచారు. మొదటి రోజు అంతా ఎగబడి సినిమా చూశారు.
అయితే మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజు థియేటర్లన్నీ బోసిపోయాయి. కంటెంట్ బాగాలేకపోతే రెండో రోజుకే సినిమా వాష్-అవుట్ అవుతుందని, ఆ అనుభవం తనకు కూడా ఉందని ఈమధ్య స్వయంగా చిరంజీవి అంగీకరించారు కూడా. ఫ్లాప్ టాక్ కు తోడు, భారీ టికెట్ రేట్లు ఆచార్య కొంప ముంచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి అలాంటి తప్పు చేయదలచుకోవడం లేదని తెలుస్తుంది. అందువల్ల తగ్గింపు ధరలకే గాడ్‌ఫాదర్ సినిమా టిక్కెట్లను అందిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.