Chiranjeevi : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి పలువురి నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. కొందరు సినిమా స్టార్స్ అయితే స్వయంగా వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత వారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే… ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక తాజాగా చిరు ప్రగతి భవన్ లో అడుగుపెట్టారు.తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కలిశారు. చిరంజీవి తన భార్యతో కలిసి మల్లు భట్టిని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు భట్టికి మెగాస్టార్ బొకే ఇవ్వగా… చిరంజీవిని ఆయన శాలువా కప్పి సత్కరించారు. మెగాస్టార్ – ఉప ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి . ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మెగాస్టార్-ఉప ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఇక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. సైరా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మంచి కమర్షియల్ హిట్ చిత్రం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారు. దీనికోసం ఆయన దర్శకుడు హరీష్ శంకర్ ను పిలిపించి మాట్లాడారు. అయితే హరీష్ దగ్గర అప్పటికప్పుడు కథ సిద్ధంగా లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సినిమా చేయాలంటే తనకు ఒక సంవత్సరం సమయం కావాలని అడిగారు. కథ, కథనం ఎంతో జాగ్రత్తగా చూసుకొని అడుగు ముందుకు వేయాలని, లేదంటే సినిమా ఫ్లాపవుతుందనే ఉద్దేశంతో హరీష్ ఉన్నారు. అప్పటికప్పుడు స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్న బాబీ కథకు చిరంజీవి ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…