Chiranjeevi : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయనని కలుస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడారు. రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే… అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
అయితే రేవంత్‌ని కలిసే సమయంలో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ తెల్ల గులాబీల బొకే ఇచ్చారు. తెల్లగులాబీలు స్నేహానికి గుర్తు. తద్వారా చిరంజీవి.. స్నేహ హస్తాన్ని చాటారని అనుకోవచ్చు. ఈ భేటీపై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. ఇది తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోవట్లేదు. నిజానికి చిరంజీవి కూడా ఇలాంటివి ఏవీ అనుకోకూడదనే కోరుకుంటున్నారని అనుకోవచ్చు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ చిరంజీవి ఆయన్ని కలవలేకపోయారు. మిగతా నటులు కొందరు సీఎంని కలిసి విషెస్ చెప్పారు కానీ, చిరంజీవి మాత్రం కొన్ని కారణాల వల్ల ఆయన్ని డైరెక్టుగా కలవలేకపోయారు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది.
రేవంత్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరారు. త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు. ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. మరోవైపు, రేవంత్, చిరంజీవి భేటీ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవడం జరిగిందని రేవంత్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…