Uday Kiran : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. ఇందులో కొందరు ఎంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారో అంతే తొందరగా కిందకు పడిపోతుంటారు. ఉదయ్ కిరణ్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అప్పట్లో లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేది.
కొన్ని సార్లు తప్పుడు ఛాయిస్‌ల వల్ల వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వలన ఈ లోకాన్ని కూడా విడిచివెళ్లాడు. అయితే ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయిన ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారుతూ ఉంటాయి. ఉదయ్ కిరణ్ కు చిరు పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగాక, అది పెళ్లి వరకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అందుకు కారణాలు అనేకం చెబుతుంటారు. అయితే ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ బ్రేకప్ సంగతి గురించి తెలిసిన కూడా తన కూతురికి ఉదయ్‌ని ఇచ్చి చిరు పెళ్లి చేయాలనుకున్నాడట.
![Uday Kiran : ఉదయ్ కిరణ్ గురించి ఆ విషయం తెలిసి కూడా చిరంజీవి తన కూతురితో వివాహం చేయాలనుకున్నాడా? Chiranjeevi know important matter about Uday Kiran](http://3.0.182.119/wp-content/uploads/2022/09/chiranjeevi-uday-kiran.jpg)
సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఉదయ్ కిరణ్ ఓ మహిళ జర్నలిస్టుతో ప్రేమలో పడ్డాడు. ఆమెను పిచ్చిపిచ్చిగా ప్రేమించాడు. మనసంతా నువ్వే సూపర్ డూపర్ హిట్ అయ్యాక తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టుతో ఉదయ్ కిరణ్ కు పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలవడంతో అది ప్రేమగా మారింది. చిన్న చిన్న మనస్పర్ధల నేపథ్యంలో ఆ మహిళ జర్నలిస్టు ఉదయ్ కిరణ్ కు బ్రేకప్ చెప్పేసింది.ఈ విషయంలో ఉదయ్ కిరణ్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పి ఎంతో బాధపడేవాడట. అప్పుడు చిరు ఆయనకి ధైర్యం చెప్పి తన కూతురితో పెళ్లి జరిపించాలని అనుకున్నాడట. కానీ ఏవో తేడాలు రావడంతో పెళ్లి పీటల వరకు వచ్చి క్యాన్సిల్ అయింది.