Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది భోళా శంకర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరంజీవి భోళా శంకర్ మూవీతో మళ్లీ పరాజయం చూశారు. ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు. ఈ 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఆయన అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కూడా. ఆయన ఊ అంటే.. అది ఏదైనా నిమిషాల్లో జరిగిపోతుంది. అది చిరు స్థాయి.
చిరు మాత్రం చిన్నాచితకా నటీనటులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘నాకు మీతో కలిసి నటించాలని వుంది. మనం ఎప్పుడు కలిసి పని చేద్దాం’ అని అడుగుతూ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రావు రమేష్ తో చిరు ఇలాగే మాట్లాడారు. ‘నాతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మనం ఎప్పుడు కలిసి సినిమా చేద్దాం’ అంటూ చిరు.. రావు రమేష్ ను అడగడం అందర్నీ షాక్ కి గురి చేసింది. రావు రమేష్ ప్రతిభావంతుడైన నటుడే, కానీ ఆయన హీరో కాదు. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి నటుడిని కూడా చిరు అడిగాడంటే… ఆశ్చర్యం వేస్తుంది. హేమా హేమీల్ని, స్టార్ హీరోలను అడిగినట్టు చిరు ఇలా సహాయ నటులను కూడా అడిగి, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు. అసలు రావు రమేశ్ కోసం కూడా చిరంజీవి ఇంతలా దిగజారిపోవాలా ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయినా చిరు ఇలా రిక్వెస్ట్ చేయడం కొత్త కాదు. గతంలో అనేక వేదికల పై హీరోయిన్లను కూడా చిరు ఇలాగే రిక్వెస్ట్ చేశాడు. ఆ మధ్య సాయి పల్లవితో ‘నాకు నీతో కలిసి స్టెప్పులు వేయాలని ఉంది’ అంటూ ముచ్చట పడ్డాడు. అంతకు ముందు తమన్నాతో కూడా ఇదే ముక్క చెప్పాడు. మధ్యలో రాశి ఖన్నా విషయంలో చిరు ఇలాగే బిహేవ్ చేశాడు. ఇక రష్మికతో అయితే.. నీకు నేను రెగ్యులర్ గెస్ట్ ను అంటూ కామెంట్లు చేశాడు. ఇప్పుడు రావు రమేష్ వంతు వచ్చింది.ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు కావొచ్చు.. కానీ గొప్పోడు చిన్నోళ్ల దగ్గర తగ్గితే చీప్ గా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడు ఇలా తగ్గి మాట్లాడితే అవతలి వారు ఎంత ఆనందం పొందుతారో చిరుకి చాలా తెలుసు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…