Chiranjeevi : రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకుంటారు. కానీ కొంతమంది ఈ పండుగను 20 రోజుల తర్వాత జరుపుకుంటారు. విభిన్నమైన రకాల డిజైన్లతో రకరకాల రాఖీలు మార్కెట్ లో కనువిందు చేస్తున్నాయి.వివిధ రాకల డిజైన్లతో తయారుచేసిన రాఖీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రాఖీలు వివిధ డిజైన్లలో లభిస్తాయి.డిజైన్ ను బట్టి కొన్ని ఎక్కువ ధర ఉంటే, మరికొన్ని తక్కువ ధరలలో లభిస్తాయి. అలాగే వివిధ ఆకారాలు, రంగులతో కూడా రాఖీలను తయారుచేస్తూ ఉంటాయి.భారత త్రివర్ణ పతాకం రంగులలో కూడా రాఖీలు ఉంటాయి.సామాన్యులు, సెలబ్రిటీలు సైతం రాఖీ పండుగని ఘనంగ జరుపుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం తన సోదరీమణులతో కలిసి రాఖీ పండుగని జరుపుకున్నారు. వారు సరదాగా సందడి చేస్తూ చిరు చేత రాఖీ కట్టించుకున్నారు. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెళ్లకు కోకాపేటలోని ల్యాండ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు చెల్లెళ్లకి చెరో ఎకరం రాసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సురేఖ కొణిదెలే ముందుండి వ్యవహారం అంతా చూసుకుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. మొత్తానికి చిరంజీవి నాడు రాఖీ సందర్భంగా ఇచ్చిన భూముల విలువ మాత్రం వందల కోట్లకు చేరుకుంది. వందల కోట్లను చిరు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు అయింది.
ఇక చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. త్వరలో రెండు సినిమాలు చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు తప్పక అలరిస్తాయని అంటున్నాడు. ఓ చిత్రం తన కూతురు నిర్మాణంలో చేయనున్నాడు. బింబిసార దర్శకుడితో కూడా చిరు ఓ సినిమా చేయనున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.