Chiranjeevi Father : తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన నటులు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే.. ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డైలాగ్ డెలివరీ, ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలి అంటే ఆయన పరిచయం చేసిన డాన్స్ స్టైల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని లిఖించాయి. 66 ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకు జోష్ తెప్పించే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్.
పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి. సినిమాలపై ఉన్న ఆసక్తితో చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటూ కటోర శ్రమ కూడా చాలా అవసరం. సినీ ఇండస్ట్రీలో నిలతొక్కుకోవాలి అంటే రాత్రి పగలు తేడా లేకుండా సినిమాలతో నటించడం అనేది చాలా ముఖ్యం. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు. ఇలా చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పవచ్చు.
![Chiranjeevi Father : మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం మీకు తెలుసా..! ఆయన ఏ చిత్రాలలో నటించారంటే..? Chiranjeevi Father venkat rao also acted in movies](http://3.0.182.119/wp-content/uploads/2022/10/chiranjeevi-father.jpg)
ఇకపోతే చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చిరంజీవి తండ్రి వెంకట్రావు గారు ఉద్యోగరీత్యా కానిస్టేబుల్ గా పనిచేసేవారు. బాపూ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమాలో ముఖ్యమైన మంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే బాగుంటుంది అనే సందేహంతో దర్శకుడు ఉన్న సమయంలో చిరంజీవి మావయ్య అల్లు రామలింగయ్య మా బావగారు ఉన్నారు కదా. ఆయనతో ఈ పాత్ర చేద్దాము అంటూ సలహా ఇచ్చారట. అలా మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంకట్రావు మంత్రి పాత్రలో నటించారు.
అంతేకాకుండా చిరంజీవి సినిమా కెరిర్ స్టార్ట్ చేయకముందే 1969లో విడుదలైన జగత్ కిలాడీ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు వెంకట్రావు. ఈ సినిమా తరవాత ఆయనకు మరిన్ని ఆఫర్ లు వచ్చినా కూడా కుటుంబ బాధ్యతల రీత్యా, ఉద్యోగ బాధ్యతలకు కట్టుబడి ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అలా సినిమాలపై, నటనపై ఉన్న మక్కువను కుటుంబం కోసం తన ఇష్టాన్ని త్యాగం చేశారు చిరంజీవి తండ్రి వెంకట్రావు.