Chiranjeevi : దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు.. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అయితే.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు హరికృష్ణ, కల్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూ.ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు.
జూ. ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే.. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని.. బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే తాజాగా చిరంజీవి కూడా ఈ ఇష్యూపై స్పందించినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ విషయంలో బాలయ్య తప్పు చేస్తున్నాడని, అలా ప్రవర్తించడం దారుణం. అదే ఆయన కొడుకు విషయంలో అయితే అలా చేస్తాడా అంటూ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్.
రాష్ట్ర విభజన సమయంలో లో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణను టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కుటుంబాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్, కొద్ది రోజులకే హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.హరికృష్ణ బ్రతికున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరుల్లో ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమను విస్మరించడంపై హరికృష్ణ కుమారులు ఇద్దరు కినుక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.