Chiranjeevi : మహానటి సావిత్రి గారి సావిత్రి క్లాసిక్ అనే మరో బుక్ రిలీజ్ అయ్యింది. సంజయ్ కిషోర్ రాసిన ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సావిత్రి క్లాసిక్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, మురళి మోహన్ తదితరులు హాజరయ్యారు. చాలా గ్రాండ్‌గా ఈ వేడుక నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా చేశారు. ఇక జయసుధ కూడా ఈ ఈవెంట్‌కి రాగా, ఆమెని చిరంజీవి, సురేఖ ప్రత్యేకంగా ఆహ్వానించారు . కూర్చున్నవారు నిలుచొని మరీ జయసుధని ఆహ్వానించారు.
జయసుధని చిరంజీవి చాలా ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సావిత్రి నటించిన కొన్ని క్లాసికల్ సినిమాల విశేషాలను ‘సావిత్రి క్లాసిక్స్’ పేరుతో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఒక పుస్తకాన్ని వేశారు. ఆమె ఈ పుస్తకాన్ని చిరంజీవి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. ‘పునాదిరాళ్లు’ సినిమాలో సావిత్రిగారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ముందు నేను డాన్స్ చేయడం .. నేను పైకి వస్తానని ఆమె అభినందించడం నాకు ఇంకా గుర్తుంది” అన్నారు. “నేను సావిత్రి గారి సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను. నాకు తల్లిలాంటి సావిత్రిగారి గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావడం లేదు. ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలబడడం నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను. ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం వలన నా జన్మ సార్ధకమైంది” అని అన్నారు.
జయసుధ మాట్లాడుతూ .. ” సావిత్రిగారి ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి గారితో కలిసి నటించే ఛాన్స్ ఒకసారి కలిగింది. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సావిత్రి గారి ఫంక్షన్ చేయడానికి ముందుకు వచ్చిన చిరంజీవిగారికి హీరోయిన్స్ అందరి తరఫున థ్యాంక్స్ చెబుతున్నాను” అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…