Chenna Kesava Reddy : ఫ్యాక్షన్ సినిమాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు. అప్పట్లో ఈ మూవీలు సంచలన విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ మూవీలకు ముందుగానే వెంకటేష్ ప్రేమించుకుందాం రా.. సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇది కూడా ఫ్యాక్షన్ సినిమానే. కానీ లవ్‌ను జోడించారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ చెన్న కేశవ రెడ్డి మాత్రం ఎంతో నిరాశ పరిచింది.
చెన్నకేశవరెడ్డి సినిమాకు ముందే బాలయ్యకు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది. దీంతో చెన్నకేశవరెడ్డికి ఓకే చెప్పారు. అలాగే ఆదితో వినాయక్ మంచి జోరు మీదున్నాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు. మూవీ ఫ్లాప్ అయింది. అయితే దీనిని ఒక క్లాసిక్ సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ ఫ్లాప్ ఎందుకు అయింది అనే కారణాలను దర్శకుడు వినాయక్ వివరించారు.
సినిమా కోసం పవర్ ఫుల్ డైలాగ్ రైటర్ అయిన పరుచూరి సోదరుల్లో పరుచూరి వెంకటేశ్వరరావుతో ట్రావెల్ అయ్యానని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయనతో క్లోజ్‌గా ఉండడం వల్ల ఆయన ఇన్‌పుట్ సినిమా కోసం తీసుకున్నానని అలా కాకుండా ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణతో ట్రావెల్ అయి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదేమో అని అభిప్రాయ పడ్డారు. ఇందుకు కారణం పరుచూరి గోపాలకృష్ణతో కలిసి పని చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది అని వినాయక్ భావించారు. అయితే వాస్తవానికి చెన్నకేశవరెడ్డిలో డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ ద్విపాత్రాభినయం వల్లే మూవీ కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు. అది లేకుండా స్టోరీ మరోలా ఉంటే.. ఫలితం వేరేలా వచ్చేదన్నమాట. అయినప్పటికీ చెన్నకేశవరెడ్డి అంటే ప్రేక్షకులకు ఇప్పటికీ పండగే.