Chatrapathi : నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమాకి ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు. కాని రిజల్ట్ మాత్రం బెడిసి కొడుతుంది. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అదరగొట్టాలని భావించాడు. కాని ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. . శుక్రవారం హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ మామూలు షాక్ ఇవ్వలేదు.
హిందీ బెల్ట్ లో ఛత్రపతి చిత్రం జీరో షేర్ నమోదైనట్లు తెలుస్తోంది. అంటే హిందీ ఆడియన్స్ ఛత్రపతి చిత్రాన్ని ఎంతలా రిజెక్ట్ చేశారో మనకు అర్థం అవుతోంది. ఎంత రాజమౌళి చిత్రం అయినప్పటికీ.. బెల్లంకొండ శ్రీనివాస్ తీసుకున్నది సమయానికి తగ్గ నిర్ణయం కాదని కొందరు విశ్లషకులు అంటున్నారు.ఇటీవల రీమేక్ చిత్రాలని ఆడియన్స్ పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్రపతికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని టాక్. ఇక ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్ర నిర్మాణంలో బెల్లంకొండ సురేష్ ఎంత పెట్టుబడి పెట్టారో తెలియదు. మొత్తంగా ఛత్రపతి హిందీ రీమేక్ ఒక కాస్ట్లీ మిస్టేక్ గా మిగిలిపోయింది.
పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకి రూ.45 కోట్ల వరకూ ఖర్చు పెట్టింది. మరో రూ.5 కోట్లు వడ్డీలు, పబ్లిసిటీ వేసుకొన్నా.. రూ.50 కోట్లయినట్టు లెక్క. ఇవన్నీ నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో వచ్చేశాయి. అయితే జీ స్టూడియోస్ సంస్థ ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని కొనేసింది. అందుకు గానూ రూ.50 కోట్లు ముట్టజెప్పిందని టాక్. సాయి శ్రీనివాస్‌తో మరో రెండు సినిమాలకు పెన్ స్టూడియోస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని ఇండస్ట్రీ టాక్.. వచ్చే యేడాది ఓ బాలీవుడ్ దర్శకుడ్ని బెల్లంకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా రిజల్ట్‌తో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…