బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఆయన తనయుడిని ఇండస్ట్రీకి గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ఏంతో భావించాడు. కాని అదే సమయంలో కొడుకు దారుణంగా ట్రోలింగ్‌కి గురయ్యాడు. ఎంతో దారుణంగా ట్రోలింగ్ జరిగినాఆ ట్రోలింగ్‌ని తట్టుకుని తాను బలంగా నిలబడటమే కాదు.. తన కుటుంబానికి సైతం బాధపడొద్దని భరోసా ఇచ్చాడు చంద్రహాస్. హీరోగా పరిచయం చేసిన తన కొడుకుని దారుణంగా ట్రోల్ చేస్తుంటే.. తల్లిడిల్లిపోయారు చంద్రహాస్ పేరెంట్స్. అయితే ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా.. ఆ ట్రోలింగే చంద్రహాస్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఓ పదేళ్లు కష్టపడితేనా కానీ రాని గుర్తింపు ఒక్కనైట్‌కే వచ్చేసింది. యాటిట్యూడ్ స్టార్‌గా చంద్రహాస్ ట్రెండ్ లో నిలిచాడు.
రీసెంట్‌గా సంక్రాంతి పందెం స్పెషల్ ప్రోగ్రాంలో చంద్రహాస్ తన తండ్రి ప్రభాకర్‌తో కలిసి డాన్స్‌తో అబ్బురపరిచాడు. ఇక బుల్ ఫైట్‌లో సైతం తన స్టామినా ఏంటో చూపించి అందరితోనూ శెభాష్ అనిపించాడు. వేదిక ఏదైనా తన యాటిట్యూడ్ మాత్రం మారదు అన్నట్టుగా.. ఇక్కడ కూడా అదే యాటిట్యూడ్ చూపించాడు చంద్రహాస్. అయితే మిమ్మల్ని ఇంత దారుణంగా ట్రోల్ చేశారు కదా.. బాధ అనిపించలేదా? అని చంద్రహాస్‌ని అడిగితే.. ‘నేను ఆరోజు కావాలని చేసింది కాదు.. నాపై ట్రోల్స్& మీమ్స్ వచ్చాయి.. కానీ నేను పిచ్చ లైట్ తీసుకున్నా. చాలామంది కెరియర్ మొత్తం కష్టపడినా ఇంత ఫాలోయింగ్ రాలేదు. నేను ఓవర్ నైట్‌లో యాటిట్యూడ్ స్టార్‌ని అయిపోయా. నాపై ట్రోల్స్ రావడం చూసి మా అమ్మ చాలా ఫీల్ అయ్యింది
కానీ నేను అంత అవసరం లేదమ్మా.. దేవుడు ఇచ్చిన వరం ఇది.. బోనస్ ఇది అని చెప్పా. నేను తప్పు చేయలేదు. ఆ ప్రెస్ మీట్‌లో ఓ ముప్పై కెమెరాలు ఉన్నాయి. డాడీ నన్ను పొగుడుతుంటే.. నాకు నవ్వు వస్తుంది.. నవ్వితే బాగోదని ఆపుకోవడానికి ట్రై చేశాను. అది మిస్ ఫైర్ అయ్యింది. చూసేవాళ్లకి అలా అనిపించింది. మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అలా అయ్యింది’ అని చెప్పాడు చంద్రహాస్. ఇక ప్రభాకర్ కూడా తన కొడుకుపై స్పందిస్తూ.. నా కొడుకు గురించి ట్రోల్స్ వస్తే చాలా బాధ పడ్డాను. వీడు వాళ్లకి నచ్చలేదు.. నచ్చలేదని చెప్పారు. నచ్చేలా ఏం చేయాలో నెక్స్ట్ ట్రై చేయాలి అని నా కొడుకు కూడా అనుకున్నాడు అంటూ నెగిటివ్ ట్రోల్స్‌పై పాజిటివ్‌గా స్పందించాడు ప్రభాకర్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…